పెనుబల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు నిధులు గోల్ మాల్ చేసిన కాంట్రాక్టర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో తహసీల్దార్ విచారణ చేపట్టారు. గ్రామంలో 12 మంది లబ్ధిదారులు.. ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతోపాటు మరో రూ.2లక్షలతో ఇండ్లు నిర్మించాలని ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇండ్లు సగం వరకు పూర్తి చేసి కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడని నాలుగు రోజుల కింద కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ వీరభద్ర నాయక్ గురువారం గంగాదేవిపాడు పంచాయతీ ఆఫీస్‌లో విచారణ చేపట్టారు.
