రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం :  భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

చండ్రుగొండ,వెలుగు: రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం చండ్రుగొండ మండలం  సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను పరిశీలించారు. గ్రామ పరిధిలో మొత్తం 1,823 ఎకరాలకు రీ-సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్‌‌‌‌కు వివరించారు. కలెక్టర్ పాత భూ రికార్డులు, మ్యాప్‌‌‌‌లను పరిశీలించారు. సుమారు 1920 నాటి పాత మ్యాప్‌‌‌‌లు, రికార్డులను పరిశీలిస్తూ అప్పటి భూముల హద్దులు, చెట్లు, కుంటలు, చెరువులు, తోటలు తదితర వివరాలను నమోదు చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూమి ఉండి రికార్డుల్లో నమోదు కాకపోవడం, పాస్‌‌‌‌బుక్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూమి వివరాలు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విజయ డెయిరీ స్థలంలో కేంద్రీయ విద్యాలయం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని విజయ డెయిరీ స్థలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్​అంకిత్​పేర్కొన్నారు. విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లికి షిఫ్ట్​ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. చుంచుపల్లిలో పాలశీతల కేంద్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్​శిరీష, డెయిరీ మేనేజర్​ సౌజన్య ఉన్నారు.