- ఇరాన్ యుద్ధం, సప్లయ్‌లో అంతరాయంతో పెరుగుతున్న ధరలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అమెరికా-–ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర గురువారం బ్యారెల్‌కు 107 డాలర్ల మార్కును తాకింది. ఈ ఏడాది మే 25 త ర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
ఆగస్టు కనిష్ట స్థాయిలతో పోలిస్తే చమురు ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగాయి. మరోవైపు వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ సెన్సెక్స్, నిఫ్టీ గురువారం లాభపడ్డాయి. సెన్సెక్స్138 పాయింట్లు పెరిగి 74,903 వద్ద, 46 పాయింట్లు పెరిగి 23,478 వద్ద ముగిశాయి.
