తెలంగాణ సంస్కృతి చూపిస్తూ తెరకెక్కిన ‘మారెమ్మ’

తెలంగాణ సంస్కృతి చూపిస్తూ తెరకెక్కిన ‘మారెమ్మ’

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘మారెమ్మ’ చిత్ర బృందం భువనగిరిలో సందడి చేసింది. పట్టణంలోని వసుంధర టాకీస్‌‌లో హీరో మాధవ్​ భూపతి రాజు (నటుడు రవితేజ సోదరుడి కుమారుడు), హీరోయిన్ దీపా బాలు ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసి.. వారితో ముచ్చటించారు.

మన సంస్కృతి విశ్వవ్యాప్తం అయ్యేలా దర్శకుడు మంచాల నాగరాజు ఈ రూరల్ డ్రామాను  అద్భుతంగా రూపొందించారని, నిర్మాత మయూర్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని నటీనటులు తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించడం తమ అదృష్టమని, ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరిస్తారనే నమ్మకముందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.