ఈ–కామర్స్ రూల్స్ మరింత కఠినం.. కొత్త నిబంధనలు తెచ్చిన కేంద్రం

ఈ–కామర్స్ రూల్స్ మరింత కఠినం.. కొత్త నిబంధనలు తెచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: ఈ–కామర్స్​ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఫిర్యాదులు రావడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ధరలను తారుమారు చేయడం, మోసపూరిత పద్ధతులు (డార్క్ ప్యాటర్న్స్), నకిలీ స్పాన్సర్డ్ లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అరికట్టడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ–కామర్స్ నిబంధనలను మార్చింది. కొత్తవి 2027 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.

ఇక మీదట ఈ–కామర్స్ సంస్థలు ధర తగ్గింపు ప్రకటించినప్పుడు తగ్గిన ధరతో పాటు మునుపటి ధరనూ స్పష్టంగా చూపించాలి. డిస్కౌంట్​ ప్రకటించడానికి గత 30 రోజుల్లో ఆ ఉత్పత్తికి ఉన్న అత్యల్ప ధరను మునుపటి ధరగా పరిగణించాలి.

సెర్చ్ ఫలితాలను తప్పుదారి పట్టించేలా చేయకూడదు. స్పాన్సర్డ్ లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కస్టమర్లు స్పష్టంగా గుర్తించేలా చేయాలి. డార్క్ ప్యాటర్న్స్ నివారణ మార్గదర్శకాలను పాటించడంతో పాటు ఏటా సొంతంగా తనిఖీ నిర్వహించి సమ్మతి (కాంప్లయెన్స్​) ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించాలి.