వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం రూపొందించిన చిత్రం ‘కాగితం పడవలు’. కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. సెప్టెంబర్ 18న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదల కాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా జర్నీ ఎప్పటికీ మర్చిపోలేను.
నిజానికి ‘కాగితం పడవలు’ అనే సినిమాను మేమంతా బీటెక్ చేసినట్టుగా చేశాం. అందరూ మమ్మల్ని పాస్ చేస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఇది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అని హీరోయిన్ కృష్ణప్రియ చెప్పింది.
ఈ చిత్రంలోని క్లైమాక్స్ చూసి ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతారని, సినిమా ఎవర్నీ డిసప్పాయింట్ చేయదని డైరెక్టర్ తుకారాం అన్నాడు. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, అందరికీ నచ్చుతుందని నిర్మాతలు అంజనప్ప, కీర్తన అన్నారు.
