వెలిచాల జీపీకి ఐఎస్వో గుర్తింపు

వెలిచాల జీపీకి ఐఎస్వో గుర్తింపు

రామడుగు, వెలుగు: గ్రామ పంచాయతీ పాలనలో పారదర్శకత, నాణ్యమైన ఈ -పంచాయతీ సేవలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సుపరిపాలన అందిస్తున్నందుకు కరీంనగర్  జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క గురువారం సర్పంచ్  వీర్ల నర్సింగరావు, పాలకవర్గ సభ్యులకు ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన డిజిటల్  సేవలు అందిస్తూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వెలిచాల పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. ఇతర పంచాయతీలు వెలిచాల గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పంచాయతీరాజ్  కమిషనర్ దివ్య పాలకవర్గాన్ని అభినందించారు.