బానోతు పవన్, గౌతమ్, నర్మద, సతీష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఐ బొమ్మ’. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వంలో కురువ జమన్న నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు రామసత్యనారాయణ, రాజా మాట్లాడుతూ ట్రైలర్ బాగుందని, సమాజంలో జరుగుతున్న ఓ సమకాలీన అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారని ప్రశంసించారు.
‘ఐ బొమ్మ’ పైరసీ సైట్ వెనుక జరిగిన సంఘటనలు, దాని నిర్వహణకు సంబంధించిన ఆసక్తికర అంశాలతో సినిమాను రూపొందించినట్టు, కేవలం 15 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని దర్శకుడు విజయ్ చెప్పాడు. ఆసక్తికరమైన కంటెంట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని నటీనటులు, నిర్మాత కురువ జమన్న అన్నారు.
