న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు సెమీస్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 2–6, 7–6 (9/7), 6–2తో ఐదోసీడ్ మిర్రా అండ్రీవా (రష్యా)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
రెండు గంటలా 19 నిమిషాల మ్యాచ్‌లో గాఫ్ తొలి సెట్‌ను చేజార్చుకుంది. బలమైన సర్వీస్‌లతో చెలరేగిన ఆండ్రీవా తొలి ఏడు పాయింట్లు సాధించి 26 నిమిషాల్లోనే సెట్‌ను కైవసం చేసుకుంది. అయితే తర్వాతి రెండు సెట్లలో గాఫ్ అద్భుతంగా పుంజుకుంది. హోరాహోరీగా సాగిన రెండో సెట్ టైబ్రేక్‌లో గాఫ్ 39 సెట్ల సుదీర్ఘమైన ర్యాలీ ఆడి 5–3 ఆధిక్యంలో నిలిచింది.
కానీ ఆండ్రీవా తర్వాతి మూడు పాయింట్లు గెలిచి తన మొదటి మ్యాచ్ పాయింట్ వద్ద నిలిచింది. అయితే రష్యన్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ బయటకు వెళ్లడంతో గాఫ్ గట్టెక్కింది. ఆపై 7–6 స్కోరు వద్ద ఆండ్రీవాకు లభించిన రెండో అవకాశాన్ని కూడా గాఫ్ వీరోచితంగా అడ్డుకుని సెట్‌ను సొంతం చేసుకుంది.
మూడో సెట్‌లో గాఫ్ ఆధిపత్యమే కొనసాగింది. 1975 తర్వాత విమెన్స్ కేటగిరీలో టాప్ సీడ్ ప్లేయర్లందరూ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 7–5, 6–1తో వాన్ డి జెండ్‌స్కూల్ప్ (నెదర్లాండ్స్)పై, కరెన్ కచనోవ్ (రష్యా) 6–2, 7–5, 3–2తో అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.
