చెన్నై: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఈస్ట్ జోన్.. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సౌత్ జోన్‌తో గురువారం ముగిసిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయినప్పటికీ భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది.
212/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌ను 99.2 ఓవర్లలో 388/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఈస్ట్ మొత్తం ఆధిక్యం 760 రన్స్‌కు చేరింది. మహ్మద్ కౌనియన్ ఖురేషి (116 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఖురేషికి ఇది తొలి సెంచరీ. అనుకూల్ రాయ్ (64)తో ఏడో వికెట్‌కు 150 రన్స్ జత చేశాడు. కుమార్ కుశాగ్ర (46) ఫర్వాలేదనిపించాడు. భారీ ఆధిక్యాన్ని ఛేదించే అవకాశం లేకపోవడంతో మధ్యాహ్నం 2:10 నిమిషాలకు ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
నిదేశ్ 2, సిరాజ్, త్రిపురాన విజయ్, షేక్ రషీద్, చామ మిలింద్ తలా ఓ వికెట్ తీశారు. ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
