80s లుక్‌లో టీమిండియా స్టార్స్.. కోహ్లీ, ధోనీ స్టన్నింగ్ పోజ్: చాట్‌జీపీటీతో సోషల్ మీడియాలో రచ్చ!

 80s లుక్‌లో టీమిండియా స్టార్స్.. కోహ్లీ, ధోనీ స్టన్నింగ్ పోజ్: చాట్‌జీపీటీతో సోషల్ మీడియాలో రచ్చ!

Team Indian Cricketers Retro Look: మైదానంలో అల్ట్రా మోడరన్ లుక్‌తో అలరించే టీమిండియా స్టార్స్ ఒక్కసారిగా 1980s రెట్రో కాలానికి వెళ్ళిపోయి అభిమానులకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో క్రియేట్ చేసిన తమ ప్రియతమ క్రికెటర్ల 80s హెయిర్‌స్టైల్స్, పాతకాలపు ఫ్యాషన్ దుస్తుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  

రాజస్టాన్, సీఎస్‌కే స్టార్స్ వింటేజ్ రచ్చ: 

ఈ సరికొత్త ఏఐ రెట్రో ట్రెండ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ప్లేయర్లు ఒకరికొకరు పోటీపడుతూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. 

* రాజస్థాన్ రాయల్స్ ధమాకా: ఆర్ఆర్ ఫ్రాంచైజీ తమ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్‌ల 1980 వింటేజ్ లుక్స్ షేర్ చేయగా క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యాయి.

* చెన్నై సూపర్ కింగ్స్ సంచలనం: సీఎస్‌కే జట్టు తమ యంగ్ ఓపెనర్ ఆయూష్ మాత్రేతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లను అప్పటి కాలపు క్లాసిక్ క్రికెటర్లుగా రీ-క్రియేట్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.

భార్యలతో కలిసి సూర్య, రహానే వింటేజ్ రోమాన్స్: 

కేవలం ఐపీఎల్ టీమ్‌లే కాకుండా భారత సీనియర్ క్రికెటర్లు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు.

* సూర్యకుమార్ యాదవ్: తన భార్య దేవిషా శెట్టితో కలిసి 80s నాటి క్లాసిక్ బాలీవుడ్ కపుల్‌లా ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

* అజింక్యా రహానే: తన భార్య రాధికా ధోపావ్కర్‌తో కలిసి ఏకంగా మూడు వేర్వేరు 1980s రెట్రో అవతారాల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి ట్రెండింగ్‌లో నిలిచాడు.

విరాట్, ధోనీ క్లాసీ లుక్స్: 

విరాట్ కోహ్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ 1980s రెట్రో అవతారంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో కింగ్ కోహ్లీ ఫోటో తెగ వైరల్ అవుతుంది. విరాట్ ఫ్యాన్స్ ఈ ఫోటోని బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఎంఎస్ ధోనీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ 1980sలో ఎలా ఉండేనో అనే ఫోటో కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో నెట్టింట తెగ వైరల్ గా మారింది.  

చాట్‌జీపీటీ (ChatGPT) నయా ఫీచరే కారణం:

ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీలో ప్రస్తుతం ఉన్న ఫొటోలను 1980ల నాటి శైలిలోకి సులభంగా మార్చే కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి రావడంతోనే ఈ ఫొటోల ట్రెండ్ ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది. క్రికెట్ స్టార్స్ నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీల వరకు ప్రతీ ఒక్కరూ తమ నచ్చిన ఫొటోలను 80s మేకోవర్ చేస్తూ ఫ్యాన్స్‌కు విపరీతమైన వినోదాన్ని అందిస్తున్నారు.