న్యూఢిల్లీ: ఆటో విడి భాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ ఐపీఓ ఈ నెల 16–18 తేదీల మధ్య ఉండనుంది. రూ.వెయ్యి కోట్ల పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను రూ.79–రూ.84 మధ్య ఖరారు చేశారు. ఐపీఓలో రూ.600 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ప్రమోటర్ల ద్వారా రూ.400 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఈ కంపెనీ పవర్ ట్రైన్స్ తయారు చేస్తుంది.
