పర్యావరణ పరిరక్షణకు గూగుల్ 5 ప్రాజెక్టులు

పర్యావరణ పరిరక్షణకు గూగుల్ 5 ప్రాజెక్టులు
  • తెలంగాణ వరి రైతుల కోసం ఒకటి

న్యూఢిల్లీ: క్లీన్​ ఎనర్జీ వాడకాన్ని పెంచడానికి గ్లోబల్​టెక్ ​కంపెనీ గూగుల్​ మనదేశంలో ఐదు ప్రాజెక్టులను మొదలుపెట్టింది. విద్యుత్ ఉత్పాదకతను అంచనా వేయడానికి 30 కోట్ల భవనాలపై సోలార్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్​ను (ఏపీఐ) విస్తరిస్తున్నట్లు తెలిపింది.

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెన్యూ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి 150 మెగావాట్ల సౌర విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ వరి రైతులకు క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ పద్ధతులు అలవాటు చేయడానికి మిట్టీ లాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తోంది.  మీథేన్ వాయువులను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం దీని లక్ష్యం.