కేటీపీఎస్ ను సందర్శించిన శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి

కేటీపీఎస్ ను సందర్శించిన శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌‌‌‌ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5, 6 దశల కర్మాగారాన్ని శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ తురైరాజా గురువారం సందర్శించారు. పాల్వంచలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇండియాలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు గానూ కేటీపీఎస్‌‌‌‌ సందర్శించారు. 

విద్యుత్ ఉత్పత్తి జరిగే తీరును పరిశీలించారు. ఆయనకు కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఈ మధుబాబు, ఏడీఈలు సమీర్, రాధాకృష్ణ, జేఏవోలు శ్రీనివాస్ రెడ్డి, కె.రాజు ఉన్నారు.