IPL 2027: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ విండో వేళ కేఎల్ రాహుల్ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి రాహుల్ బయటకు వెళ్ళిపోతున్నాడని, కేకేఆర్ (KKR) జట్టు అతన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమైందంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఢిల్లీ టీమ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీ చేసిన ఒక సంచలన కామెంట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
కోచ్‌పై కాఫీ విసిరి కొట్టాడా:
ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీకి, కేఎల్ రాహుల్‌కు మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నడిచిందని.. కోపంలో రాహుల్ ఏకంగా కోచ్‌పై కాఫీ విసిరి కొట్టాడంటూ నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా రాహుల్ ప్రశాంతంగా కాఫీ తాగుతున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, డీసీ అఫీషియల్ హ్యాండిల్ స్పందిస్తూ.. ఎవరిపైనా కాఫీ చల్లకండి బాస్! (Kisi pe phekna mat) అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ కామెంట్‌తో వివాదం నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కేకేఆర్‌కు ట్రేడ్ సస్పెన్స్‌పై క్లారిటీ:
కాఫీ వివాదం కారణంగా కేఎల్ రాహుల్‌ను కేకేఆర్‌కు ఇచ్చేస్తున్నారనే వార్తలను ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ పూర్తిగా తోసిపుచ్చారు. రాహుల్ అత్యద్భుతమైన ఆటగాడని, రాబోయే కొన్ని ఐపీఎల్ సీజన్ల వరకు అతడే తమ ఫ్రాంచైజీ కీలక ప్లేయర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశారు. దీంతో రాహుల్ ట్రేడింగ్ ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ALSO READ : IND vs AFG టీ20కి సంజు, ఇషాన్ ఇన్..
ఢిల్లీ తరఫున రాహుల్ రికార్డులు:
* 2025 సీజన్: మిడిల్ ఆర్డర్‌లో దిగి 53.90 సగటుతో 539 పరుగులు.
* 2026 సీజన్: ఓపెనర్‌గా ప్రమోషన్ పొంది 174.41 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 600 పరుగులు.
* ఓవరాల్ రికార్డు: 27 ఇన్నింగ్స్‌ల్లో 49.21 సగటుతో 1,132 రన్స్ (2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు).
* అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్ ని వదులుకోవడానికి ఢిల్లీ యాజమాన్యం సిద్ధంగా లేదు. వివాదాలను పక్కనబెట్టి రాబోయే సీజన్‌లోనూ రాహుల్‌నే తమ మెయిన్ వెపన్‌గా బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
Delhi Capitals response to KL Rahul making the coffee 😂🔥 pic.twitter.com/0GwFirMfVT
— Johns. (@CricCrazyJohns) September 11, 2026
