Prabhas KTR: ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. సోషల్ మీడియాలో సరదా వీడియో వైరల్

Prabhas KTR: ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. సోషల్ మీడియాలో సరదా వీడియో వైరల్

పొలిటికల్ ఫైర్‌బ్రాండ్‌గా కేటీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయనలో ఓ ఫన్ సైడ్ కూడా ఉందని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతోంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..

‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్‌కాస్ట్‌లో కేటీఆర్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. టాక్ షోలో భాగంగా పిల్లలు తమ ఫేవరెట్ టాలీవుడ్ హీరోలతో కేటీఆర్ మాట్లాడాలని కోరారు. ఇక పిల్లల కోరికను కాదనలేకపోయిన కేటీఆర్.. వెంటనే ఫోన్ తీసి స్టార్ హీరోలకు కాల్స్ చేయడం మొదలుపెట్టారు.

మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌కు కేటీఆర్ కాల్ ట్రై చేశారు. అయితే ఆ సమయంలో ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ‘మన స్టార్ హీరోలు దొరకరే!’ అనుకుంటున్న సమయంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపటికే ప్రభాస్ నుంచి రిటర్న్ కాల్ వచ్చింది. ఇక ఆ ఫోన్ రింగ్ అవ్వగానే పిల్లల్లో ఫుల్ ఎగ్జైట్‌మెంట్. అయితే కేటీఆర్ మాత్రం కాల్‌ను ఓ చిన్నారికి ఇచ్చి.. ప్రభాస్‌తో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. అక్కడే అసలు ప్రాంక్ మొదలైంది.

ఆ చిన్నారి.. ఈ ఫోన్ తనకు రోడ్డుపై దొరికిందని, అందులో ఉన్న నంబర్ చూసి కాల్ చేశానని చెప్పింది. అంతేకాదు.. తాను ఎవరితో మాట్లాడుతున్నానో చెప్పాలని ప్రభాస్‌ను అడిగింది. దీంతో ప్రభాస్‌కు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. విషయం క్లారిటీ కాకపోవడంతో కాల్ కట్ చేశారు. ఆ తర్వాత కేటీఆర్ స్వయంగా ప్రభాస్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ప్రాంక్ రివీల్ అయింది. పిల్లల సరదా కోసం ఇలా చేశామని కేటీఆర్ చెప్పడంతో ప్రభాస్ కూడా కూల్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పిల్లలు ప్రభాస్‌ను కలవాలని అనుకుంటున్నారని కేటీఆర్ చెప్పడంతో.. వారిని కలిసేందుకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో అక్కడున్న పిల్లల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.మొత్తానికి.. ఒకవైపు కేటీఆర్ చిలిపి ప్రాంక్, మరోవైపు ప్రభాస్ కూల్ రియాక్షన్.. ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది. ‘ఇంత పెద్ద స్టార్ అయినా ప్రభాస్ నేచర్ మాత్రం సేమ్’ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు