హైదరాబాద్, వెలుగు: పదవి, అధికారం కంటే దేశ సేవకే ప్రాధాన్యమిస్తూ ప్రధాని మోదీ పనిచేస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ, దేశం పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమన్నారు.
హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో యువ న్యాయవాది అంబర్ అగర్వాల్ రచించిన 'గవర్నెన్స్ ఆఫ్ ది సెల్ఫ్, 75 లెసెన్స్ ఇన్ లీడర్ షిప్, డిసిప్లేన్ అండ్ సర్వీస్' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
స్వీయ క్రమశిక్షణ, సంయమనం, కర్తవ్యనిష్ఠ, నిస్వార్థ సేవలను జీవితంలో ఆచరించినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మహేంద్రనాథ్ పాండే, మాజీ డీజీపీ అరవింద్‌రావు, సామాజిక కార్యకర్త తేమ్సుతులా ఇమ్సోంగ్, రాకేష్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
