భారత్ ‘హై షుగర్’ సమస్యపై చర్య తీసుకోవాలి.. స్కూళ్ల చుట్టూ అనారోగ్యకరమైన స్నాక్స్ !

భారత్ ‘హై షుగర్’ సమస్యపై చర్య తీసుకోవాలి.. స్కూళ్ల చుట్టూ అనారోగ్యకరమైన స్నాక్స్ !

సుప్రీం కోర్టు ఆదేశంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్యాకేజ్డ్ ఫుడ్‌‌‌‌‌‌‌‌పై ముందుభాగంలో ఎర్ర హెచ్చరిక లేబుల్‌‌‌‌‌‌‌‌ను ప్రతిపాదించింది. కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటే ఆ ప్యాకెట్ ముందుభాగంలో ఎరుపు రంగులో ‘స్టాప్‌‌‌‌‌‌‌‌ సైన్‌‌‌‌‌‌‌‌’ మాదిరిగా ఉండే షడ్భుజి హెచ్చరిక  లేబుల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలి. అధిక చక్కెర ఉంటే ‘హై షుగర్’ అని బోల్డ్‌‌‌‌‌‌‌‌గా కనిపించాలి.

ఇది మంచి ముందడుగే కానీ,  జంక్‌‌‌‌‌‌‌‌ఫుడ్ నియంత్రించడానికి ఇది ఒక్కటే సరిపోదు అని డాక్టర్లు ప్రవీణ్ జార్జ్ పాల్, వందనా జైన్  అంటున్నారు. వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2026 ప్రకారం భారత్‌‌‌‌‌‌‌‌లో 5-19 ఏళ్ల వయసులో 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉన్నారు.  దీనికి కారణం పిల్లలు ఎక్కువ తినడం కాదు, ఏం తింటున్నారనేది.

బ్రేక్ ఫాస్ట్  సీరియల్స్,  హెల్త్ డ్రింక్స్, తీపి పెరుగు, ఎనర్జీ డ్రింక్‌‌‌‌‌‌‌‌, విటమిన్లు పేరుతో  ప్యాకేజ్డ్‌‌‌‌‌‌‌‌ ఫుడ్ అమ్ముతున్నారు.  కానీ అందులోని  షుగర్  గురించి చెప్పరు. 2024లో  ఒక విదేశీ కంపెనీ భారత్‌‌‌‌‌‌‌‌లో  అమ్మే చిన్న పిల్లల ఆహారంలో  చక్కెర కలిపిందని, అదే ఉత్పత్తిని  యూరప్‌‌‌‌‌‌‌‌లో  చక్కెర లేకుండా అమ్మిందని తేలింది.  మన  ఇళ్లల్లో ఫేమస్ అయిన ఒక హెల్త్ డ్రింక్ కేవలం ఫ్లేవర్డ్ షుగర్ సిరప్ అని సోషల్ మీడియాలో గొడవ అయితేనే కంపెనీ 15% షుగర్ తగ్గించింది,  రెగ్యులేటర్ కాదు.

స్కూళ్ల చుట్టూ అనారోగ్యకరమైన స్నాక్స్
స్కూళ్లు, కాలేజీల చుట్టూ అత్యంత  చౌకైన,  అనారోగ్యకరమైన స్నాక్స్ దొరుకుతున్నాయి. రూ.20కే  దొరికే ఒక ఎనర్జీ డ్రింక్‌‌‌‌‌‌‌‌లో 17  గ్రాముల షుగర్ ఉంది.  లేబుల్‌‌‌‌‌‌‌‌పై  ‘పిల్లలకు కాదు’ అని ఉన్నా విక్రయిస్తున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ   స్కూళ్లలో  ఏం అమ్మకూడదో  చెప్పింది. కానీ ఆ రూల్స్ ఆప్షనల్ అయ్యాయి. 

క్యాంటీన్లలో చౌకగా, బాగా అమ్ముడుపోయేవే  పెడుతున్నారు.  ఎర్ర లేబుల్ అమలు చేస్తేనే ఉపయోగం. రెండో సమస్య ఈ రూల్ కేవలం ప్యాకేజ్డ్ ఫుడ్​కే వర్తిస్తుంది. భారత్‌‌‌‌‌‌‌‌లో  షుగర్,  ఉప్పులో సగం అన్-బ్రాండెడ్‌‌‌‌‌‌‌‌గా  బండి, దాబా, షాపుల్లో అమ్ముతున్నారు. 

బిస్కెట్ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌పై ఎర్ర లేబుల్ పెడితే, పక్కనే లూజ్‌‌‌‌‌‌‌‌గా అమ్మే జిలేబీలు ఇతర స్వీట్ల సంగతేంటి?.  యూకేలో  సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమపై  షుగర్  కంటెంట్ ఆధారంగా ట్యాక్స్ పెడితే, కంపెనీలు ధర పెంచకుండా షుగర్ తగ్గించాయి, వినియోగం తగ్గింది.

భారత్‌‌‌‌‌‌‌‌లో సెప్టెంబర్ 2025 నుంచి తీపి డ్రింక్స్, జీరో- షుగర్ డ్రింక్స్ అన్నింటిపై ఒకేలా 40%  జీఎస్టీ వేశారు. దీనివల్ల కంపెనీలకు షుగర్  తగ్గించే ప్రోత్సాహం లేదు.   ఆరోగ్యకరమైన ఆహారాన్ని చౌకగా అందించే చర్యలు తీసుకోవాలి. ఎర్ర లేబుల్  కేవలం మొదటి అడుగు. పిల్లలకు మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌పై  పరిమితి,  అన్​ఆర్గనైజ్డ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  రూల్స్,  షుగర్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌పై  నిజాయితీ చర్చ అవసరం.

ఇరికి మహేష్ అడ్వకేట్

  • ఓపెన్ ​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.