రేవణ్ణ ఫోన్‌‌‌‌లో పోర్న్ వీడియోలు.. పరప్పణ జైలులో మొబైల్ వాడుతూ దొరికిపోయిన మాజీ ఎంపీ

రేవణ్ణ ఫోన్‌‌‌‌లో పోర్న్ వీడియోలు.. పరప్పణ జైలులో మొబైల్ వాడుతూ దొరికిపోయిన మాజీ ఎంపీ

బెంగళూరు: జైలు పాలైన జనతాదళ్(సెక్యులర్) మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్, ఇతర డివైజ్‌‌‌‌లపై జరిపిన ఫోరెన్సిక్ అనాలిసిస్‌‌‌‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.

ఆయన ఫోన్‌‌‌‌లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు ఉన్నట్టు తేలింది. గత నెలలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు జైలు గదిపై ఆకస్మిక దాడి సమయంలో, రేవణ్ణ మొబైల్ వాడుతూ దొరికిపోయారు.

రేప్ కేసులో దోషిగా తేలిన రేవణ్ణ.. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. బెంగళూరులోని పరప్పణ సెంట్రల్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆగస్ట్ 11న క్రైమ్ బ్రాంచ్ అధికారులు హై సెక్యూరిటీ బ్యారక్‌‌‌‌లపై జరిపిన రెయిడ్స్‌‌‌‌లో రేవణ్ణ మొబైల్ వాడుతున్నట్టు గుర్తించారు. ఆయన గది నుంచి అధికారులు ఒక మొబైల్ ఫోన్, చార్జర్, పెన్ డ్రైవ్, నోట్‌‌‌‌బుక్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.