కేటీఆర్ పీఏ, పీఆర్వోకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు

కేటీఆర్ పీఏ, పీఆర్వోకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2026 సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటలకు స్టేషన్ కు రావాలని నోటీసులు పంపించారు.  

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  గేట్ నంబర్–3 ఘటనపై మహేందర్ రెడ్డి, మహేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే వీరికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. 

తదుపరి ఆదేశాల వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని  హైకోర్టు పోలీసులకు సూచించింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో విచారణకు నోటీసులు జారీ చేశారు  సైఫాబాద్ పోలీసులు.