బ్రిక్స్ దౌత్యం హైలైట్స్..3 రోజుల్లో 15 కీలక ఒప్పందాలు

బ్రిక్స్ దౌత్యం హైలైట్స్..3 రోజుల్లో 15 కీలక ఒప్పందాలు

భారత్ అధ్యక్షతన మూడు రోజుల 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంత్యంత చారిత్రాత్మక దౌత్య విజయంతో ముగిసింది. ప్రధాని మోదీ ఈ మూడు రోజుల్లో 15 మంది ప్రపంచ దేశాధినేతలతో ద్వౌపాక్షిక సమాశాలు నిర్వహించి వ్యూహాత్మక రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ప్రతిపాదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ కు సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం ఈ సమ్మిట్ లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం. 

ఈమూడు రోజుల మారథాన్ దౌత్యంలో ప్రధాని మోదీ రష్యా, చైనా, ఇరాన్, మలేషియా, యూఏఈ, వియత్నాం, ఈజిప్టు, ఇండోనేషియా,దక్షిణాఫ్రికా వంటి 15 దేశాల అగ్రనేతలతో వ్యక్తిగతంగా సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. 

యుద్దం కాదు.. చర్చలు, దౌత్య విధానాలే  అంతర్జాతీయ వివాదాలకు పరిష్కారం అని స్పష్టం చేసిన ఉమ్మడి డిక్లరేషన్ పై ఇరాన్, యూఏఈ తో సహా బ్రిక్స్ దేశాలన్నీ ఏకాభ్రియానికి వచ్చాయి. 

బ్రిక్స్ దేశాల నేతలో ప్రధాని మోదీ జరిపిన చర్చల్లో  రక్షణ, ఇంధన భద్రత, పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, కనెక్టివిటీ, కీలక ఖనిజాల సరఫరా, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. 

ఇండియా, రష్యా ఒప్పందాలు..ముఖ్యంగా రష్యాతో భారత్ కీలక ఒప్పందాలు చేసుకుంది.  500 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా ఒప్పందంపై సంతకాలు చేశారు ప్రధాని మోదీ, పుతిన్. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, రక్షణ రంగాలతో పాటు 2030 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్టకు చేర్చడంపై సమీక్షించారు. 

భారత్-చైనా సంబంధాల బలోపేతం.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగిన ద్వైపాక్షిక భేటీలో సరిహద్దుల్లో శాంతిభద్రతల నిర్వహణ, ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణపై కీలక చర్చలు జరిగాయి.

గ్లోబల్ సౌత్ ,స్థానిక కరెన్సీల వాడకం..అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచడం, అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత కల్పించడంపై భారత్ గట్టిగా నొక్కి చెప్పింది. 

 సదస్సు ద్వారా అంతర్జాతీయ వేదికలపై విభిన్న రాజకీయ వైఖరులు కలిగిన దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో భారతదేశం తన తిరుగులేని దౌత్య శక్తిని మరోసారి నిరూపించుకుంది.