గణేష్ స్పెషల్: నీటిలో కొలువైన వినాయకుడు.. కోర్కెలు తీర్చే వరసిద్ధి గణపయ్య.. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ టెంపుల్

గణేష్ స్పెషల్:  నీటిలో కొలువైన వినాయకుడు.. కోర్కెలు తీర్చే వరసిద్ధి గణపయ్య.. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ టెంపుల్

హిందువులు ఏ పూజ మొదలు పెట్టినా  తొలిసారిగా పూజించే .. విఘ్నాల​ అధిపతి పుట్టిన రోజు అంటే వినాయకచవితి రోజు ( సెప్టెబర్​ 14) .. ప్రతి ఇంటి ముందూ పపుపు గణపయ్య దర్శనమిచ్చాడు. వీధి వీధినా వినాయకుడి నామస్మరణ వినిపిస్తుంది. మట్టి విగ్రహాల నుంచి భారీ ప్రతిమల వరకు గణనాథుడి రూపాలు భక్తిని చాటుతాయి.  కాని.. ఒక  తెలుగు రాష్ట్రాల్లో వేంచిసిన ఓ వినాయకుడు మాత్రం నీటిలో కొలువై, తనను తాను ఆవిష్కరించుకున్న స్వయంభువుగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.  ఆయనే చిత్తూరు సమీపంలోని కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి.  వినాయక చవితి సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి గురించి తెలుసుకుందాం. . .!

ఆంధ్రప్రదేశ్​ లోని చిత్తూరు పట్టణానికి సుమారు 11 కిలో మీటర్ల దూరంలో బహుదా నది పరివాహక ప్రాంతంలో కాణిపారకం పుణ్యక్షేత్రం ఉంది.ప్రాచీక కాలంలో  ఈ ప్రాంతాన్ని 'కాణిపాకం అని పిలిచేవారని ఆలయ చరిత్ర చెప్తోంది.భవిత చెప్పింది. 'కాణి' అంటే కొంత వ్యవసాయ భూమి 'పారకం అంటే అ భూమికి నీరు ప్రవహించడం అనే అర్థాలు ఉన్నాయి.  కాలక్రమంలో కాణిపారకం.. కాణిపాకంగా మారింది .  

ఈ పేరుకు సంబందించి ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది.   స్వామివారు వెలిసిన బావిలో కొబ్బరికాయలు సమర్పించగా వాటి నీరు పొలాల్లోకి ప్రవహించి  కాణి భూమిని తడిపిందని, అందుకే ఈ ప్రాంతా కాణిపాకం అనేపేరు వచ్చిందని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.

ఒక బావి.. ఒక అద్భుతం...

కాణిపాకం క్షేత్ర మహిమను చెప్పేటప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది.ముగ్గురు అన్నదమ్ముల కథ..  స్థలపురాణం ప్రకారం పూర్వం ఇక్కడ ముగ్గురు సోదరులు ఉండేవారు వారిలో ఒకరు చెవిటివారు, మరొకరు  మూగవారు, ఇంకొకరు గుడ్డివారు వారు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఒక వేసవిలో వారి పొలంలోని బావి ఎండిపోయింది.

 నీటి కోసం బావిని మరింత లోతుగా తవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. అలా తవ్వుకుంటూ వెళ్లగా ఓ దశలో గట్టి రాయి తగిలింది. దానికి తొలగించే ప్రయత్నం చేయగానే  బావిలో నుంచి రక్తం పొంగి బయటకు వచ్చిందని కథనం. 

ఆ రక్తం వారి శరీరాలను తాకిన వెంటనే అద్భుతం జరిగిందట.   తమ లోపాలు తొలగిపోయి, ముగ్గురు సాధారణ స్థితికి వచ్చారని స్థలపురాణం చెప్తుంది. ఈ వార్త క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాల కు వ్యాపించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దానిని మరింత తవ్వగా, నీటిలో వినాయకుడి విగ్రహం దర్శనమిచ్చిందని నమ్మకం. అప్పటి నుంచి ఆ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారింది.

నీటిలోనే స్వామివారి సన్నిధి..

కాణిపాకం వినాయకుడి ప్రత్యేకతల్లో అన్నింటికంటే ఆశ్చర్యం కలిగిం చేది ఇదే. స్వామివారు కొలువైన బావిలో ఎప్పుడూ నీరు కనిపిస్తుంటుంది. ఆ నీటిలోనే స్వామివారి సన్నిధి ఉంటుంది. స్వయంభువుగా వెలిసిన వినాయకుడిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇక్కడ భక్తికి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. 

సాధారణంగా దేవుడి విగ్రహం ముందు నిలబడి దర్శనం చేసుకుంటాం. కానీ కాణిపాకంలో మాత్రం నీటి మధ్య నుంచి వెలసిన స్వామివారికి దర్శించుకోవడం భక్తుల మనస్సును మరోలా తాకుతుంది.  ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని కళ్లకు కనిపించేలా చేసే అనుభూతి అది.

వరసిద్ధి వినాయకుడు ఎందుకు ప్రత్యేకం?

 'వరసిద్ధి అనే పేరులోనే ఒక భక్తిభావం ఉంది భక్తులు కోరిన కోరికలను నెరవేర్చే స్వామిగా కాణిపాకం గణపయ్యను విశ్వసిస్తారు. ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా జరగాలని కోరుకునే వారు గణనాధుడిని ప్రార్థించడం మన సంప్రదాయం.   అందుకే విద్యార్థి నుంచి వ్యాపారి వరకు...కొత్త జీవితాన్ని ప్రారంభించే యువత నుంచి కుటుంబ సభ్యులతో వచ్చే  భక్తుల వరకు ఎన్నో ఆశలతో స్వామివారి సన్నిధికి చేరుతుంటారు.

 కాణిపాకం వెళ్లిన భక్తుడి చేతిలో కొబ్బరికాయ ఉండొచ్చు. మనసులో కోరిక ఉండొచ్చు కళ్లలో భక్తి ఉండొచ్చు. కానీ గర్భగుడి ముందు నిలిచిన ఆ క్షణంలో మాత్రం కోరిక కంటే ఎక్కువగా ఒక ప్రశాంతత మునుసును నింపుతుంది..

భక్తి.. ప్రకృతి.. చరిత్ర..

కాణిపాకం ప్రత్యేకత కేవలం ఆలయంలోనే  కాదు. ఈ క్షేత్రం చుట్టూ ఉన్న ప్రకృతి, గ్రామీణ వాతావరణం కూడా యాత్రికుడికి ప్రశాంతతను అందిస్తాయి. నగరాల హడావుడికి దూరంగా నెమ్మదిగా సాగే గ్రామీణ జీవనశైలి మధ్యలో ఉన్న ఈ పుణ్యక్షేతం. భక్తి ప్రయాణాన్ని ఒక ఆత్మీయ అనుభూతిగా మార్చుతుంది. 

ఒకప్పుడు పొలాల మధ్య ఉన్న చిన్న ప్రాంతం.. నేడు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ప్రసిద్ధ క్షేత్రంగా ఎదిగింది. అయినా కాణిపాకం కథలోని మట్టి వాసన మాత్రం మారలేదు. ఆ బావి కథలోని ఆధ్యాత్మికత కూడా మారలేదు.

నమ్మకానికి చిరునామాగా..

దేవుడిని చూడటానికి మనం ఆలయానికి వెళ్లాం. కానీ కొన్ని క్షేత్రాలు మనల్ని మనలోకి చూనుకునేలా చేస్తాయి. కాణిపాకం కూడా అలాంటి త్రమే నీటిలో కొలువైన స్వయంభు వినాయకుడి రూపం. ఎన్నో తరాలుగా కొనసాగుతున్న విశ్వాసం.. వేలాదిమంది భక్తుల ప్రార్థనలు, ఇవన్నీ నచోట కాణిపాకం ఒక ఆలయం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం..