WPL వేలానికి డేట్ ఫిక్స్?.. అక్టోబర్ 28న కొచ్చిలో ఆక్షన్!

WPL వేలానికి డేట్ ఫిక్స్?.. అక్టోబర్ 28న కొచ్చిలో ఆక్షన్!

WPL 2027 auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు బిసీసీఐ గ్రాండ్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. ఐదో సీజన్‌ కోసం ఆక్షన్‌తో పాటు మ్యాచ్‌లు నిర్వహించే వేదికలపై డబ్ల్యూపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో కీలక చర్చలు జరిగాయి. ఈసారి అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు కొత్త స్టేడియంలను బరిలోకి దించేందుకు బోర్డు ప్లాన్ చేస్తోంది.

అక్టోబర్ 28న కొచ్చిలో ఆక్షన్ రచ్చ: 

డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలాన్ని అక్టోబర్ 28వ తేదీన కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గత సీజన్ల కంటే ఈసారి ఆక్షన్ హోరాహోరీగా సాగేలా ఫ్రాంచైజీలు కూడా తమ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయి.

వారణాసి కొత్త గ్రౌండ్‌పై బీసీసీఐ కన్ను: 

* ఈసారి టోర్నీ కోసం ముంబైలోని ఐకానిక్ బ్రబౌర్న్ స్టేడియంను ఒక వేదికగా ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేశారు. ఇక రెండో సిటీ కోసం వడోదర, లేదా కొత్తగా నిర్మించిన వారణాసి స్టేడియం మధ్య పోటీ నెలకొంది.

* వారణాసి ఎంట్రీ: జనవరి 2027 నాటికి వారణాసిలోని కొత్త స్టేడియం సిద్ధమైతే, అక్కడ డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. దీని కోసం త్వరలోనే బీసీసీఐ అధికారులు స్టేడియాన్ని పరిశీలించనున్నారు.

* చిన్నస్వామి డౌటే: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై చర్చ జరిగినప్పటికీ, స్థానిక అధికారుల నుంచి పర్మిషన్ల వ్యవహారం కాస్త కష్టంగా మారేలా ఉంది.

4 ఫైనల్స్ ఓడిపోయిన అన్‌లక్కీ టీమ్: 

2026 సీజన్‌లో ఆర్సీబీ టీమ్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి కప్పు కొట్టగా, లీగ్ హిస్టరీలో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ చెరో రెండుసార్లు విజేతలుగా నిలిచాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం నాలుగు సీజన్లలోనూ ఫైనల్ చేరి ఒక్కసారి కూడా కప్పు గెలవలేక బ్యాడ్ లక్‌ను కొని తెచ్చుకుంది. వారణాసి లేదా వడోదర వేదికలపై త్వరలోనే బీసీసీఐ అధికారిక క్లారిటీ ఇవ్వనుంది.

►ALSO READ | విదేశాల్లో ఆక్షన్ ఎందుకు?: బీసీసీఐని నిలదీసిన ఫ్రాంచైజీలు.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 మినీ వేలం!