Ajit Agarkar: టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026.. ఇలా హ్యాట్రిక్ ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలను భారత్‌కు అందించిన ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటు వేయడం ఖాయమైంది. వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జట్టును ఎంపిక చేయడమే అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీకి చివరి సమావేశం కానుంది. ఒప్పందం పొడిగింపుపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో, అగార్కర్ బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియాకు థ్యాంక్స్ నోట్ పంపి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు.
రోహిత్ శర్మతో గొడవ.. అగార్కర్‌కు పదవి గండం:
* టీ20లు, టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత జట్టును విజయవంతంగా నడిపించిన అగార్కర్‌కు బీసీసీఐ పెద్దలతో ఎక్కడ చెడిందో తెలుసా?
* 2027 వరల్డ్ కప్ వివాదం: 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని, అతన్ని పక్కనబెట్టాలని అగార్కర్ కమిటీ తెగేసి చెప్పింది.
* బోర్డు ఎదురుదెబ్బ: కానీ బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మాత్రం బహిరంగంగానే రోహిత్ శర్మకు మద్దతు ఇచ్చారు. రోహిత్ శర్మను వదిలించుకోవాలనే అగార్కర్ పట్టుదల బోర్డు పెద్దలకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అజిత్ కాంట్రాక్ట్‌ను 2027 వరల్డ్ కప్ వరకు పొడిగించాలనే అభ్యర్థనను బిసీసీఐ ఇప్పటికే పక్కనబెట్టేసింది.
అగార్కర్ ఆబ్సెంట్.. లక్ష్మణ్ ల్యాండింగ్:
ముంబైలో ఇటీవల జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ హాజరుకాకపోవడం బోర్డు తీవ్ర అసహనానికి గురైంది. నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఉండటంతో ఆన్‌లైన్‌లో కూడా కలవలేకపోయాడని సెక్రటరీ సైకియా సమర్థించినప్పటికీ, బోర్డు పెద్దలు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అజిత్ అగార్కర్ కథ ముగియడంతో, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్‌గా ఉన్న భారత దిగ్గజ బ్యాటర్ VVS లక్ష్మణ్ తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఐసీసీ ట్రోఫీలు తెచ్చిపెట్టినా సరే, రోహిత్ శర్మ లాంటి దిగ్గజంతో పెట్టుకుని అగార్కర్ తన సీటును గాల్లో కలిపేసుకున్నాడనే చర్చ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసుకుంది.
