దుబాయ్: ఇండియా విమెన్స్ జట్టు స్పిన్నర్ శ్రీచరణి.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లను సాధించింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి (804) తొలిసారి 800 రేటింగ్ పాయింట్లను సాధించి నంబర్‌వన్ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకుంది. ఇండియా తరఫున బ్యాటర్లు, బౌలర్ల విభాగంలో ఇదే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.
2011లో మిథాలీ రాజ్ నెలకొల్పిన 780 రేటింగ్ పాయింట్ల రికార్డును శ్రీచరణి అధిగమించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ మేఘన్ షట్ (2018) పేరిట ఉన్న ఆల్‌టైమ్ గరిష్ట రేటింగ్ పాయింట్లు (806)కు శ్రీచరణి రెండు పాయింట్ల దూరంలో ఉంది. ఇక ఆసియా కప్‌లో 14 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (729) నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌లో నిలిచింది. పేసర్ నందాని శర్మ, లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్ వరుసగా 94, 96వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (745), షెఫాలీ వర్మ (741) వరుసగా ఐదు, ఆరో ర్యాంక్‌ల్లో ఉన్నారు.
