ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌‌‌‌ అంకిత్‌‌‌‌

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌‌‌‌ అంకిత్‌‌‌‌

భద్రాచలం, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌‌‌‌ అంకిత్‌‌‌‌ సూచించారు. మంగళవారం మన్యంలోని దుమ్ముగూడెం మండలంలో ఆయన పర్యటించారు. భూ రికార్డుల్లో స్పష్టత తీసుకురావాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, యంగ్‌‌‌‌ ఇండియా పాఠశాల పనులను స్పీడప్​ చేయాలని ఆదేశించారు.

ముల్కనపల్లిలో కొనసాగుతున్న భూ రీ-సర్వేను సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ మృణాల్‌‌‌‌ శ్రేష్ఠతో కలిసి పరిశీలించిన కలెక్టర్‌‌‌‌, భూ వివరాలు, ఎంజాయర్ల సంఖ్య, రికార్డులు, సర్వే పురోగతిపై ఆరా తీశారు. సరైన సమాచారం ఇవ్వలేకపోయిన ఆర్‌‌‌‌ఐపై అసంతృప్తి వ్యక్తం చేసి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సరైన సమాచారం ఇవ్వలేకపోయిన ఎంపీడీవో వివేక్‌‌‌‌చంద్రకు ఛార్జ్‌‌‌‌మెమో జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం చిన్నబండిరేవు గ్రామంలోని యంగ్‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ నిర్మాణ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని సూచించారు.