భద్రాచలం: ఆలయ అభివృద్ధి పనులపై వైదిక కమిటీ అభ్యంతరాలు

భద్రాచలం: ఆలయ అభివృద్ధి పనులపై  వైదిక కమిటీ అభ్యంతరాలు

భద్రాచలం, వెలుగు: రూ.350 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులపై సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈవో దామోదర్‌‌‌‌రావు, ఆర్కిటెక్ట్‌‌‌‌, ఇంజనీర్లు పనులను పరిశీలించారు. దక్షిణం వైపు భూ స్పర్శ కోసం మట్టితో నింపిన తర్వాతే ఉపాలయాల నిర్మాణాలు చేపట్టాలని వైదిక కమిటీ సూచించింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఆర్కిటెక్ట్‌‌‌‌కు వివరించింది. 

గర్భగుడికి ఇరువైపులా లక్ష్మీతాయారు, ఆండాళ్లమ్మ ఆలయాలు, నిత్యకల్యాణ మండపాన్ని రెండో ప్రాకారంలో నిర్మించాలని కోరింది. ఈ అంశాలను కమిషనర్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తామని ఆర్కిటెక్ట్‌‌‌‌ హామీ ఇచ్చారు. కమిషనర్‌‌‌‌తో చర్చించి నివేదిక అందించేలా చొరవ తీసుకోవాలని ఈవోను వైదిక కమిటీ కోరింది.