శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’.. డబ్బు చుట్టూ సాగే ఫుల్ ఎంటర్‌టైనర్

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’.. డబ్బు చుట్టూ సాగే ఫుల్ ఎంటర్‌టైనర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న  శ్రీవిష్ణు.. తాజాగా మరో  ఆసక్తికరమైన ఎంటర్‌‌టైనర్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కాంబోలో ఇటీవల ఓ సినిమాను అనౌన్స్ చేయగా, దీనికి ‘ఫ్యామిలీ ప్యాక్’  అనే ఫన్నీ టైటిల్‌‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.  

ఇందులో ఓ కలర్‌‌‌‌ఫుల్‌‌ బిల్డింగ్‌‌పై నుంచి శ్రీవిష్ణు  కిందికి పడుతూ కనిపిస్తుండగా, చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్,  ఎగురుతున్న కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి.  సూట్‌‌కేస్, కాలిక్యులేటర్ వంటి వస్తువులు సినిమాలో డబ్బు, కుటుంబ అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనే హింట్ ఇస్తున్నాయి. సాక్షి మదోల్కర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  నరేష్ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రామ్ అబ్బరాజు సినిమాలతో అనుబంధం ఉన్న రచయితలు భాను భోగవరపు, నందు సావరిగాన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.