రేపోమాపో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు..దానం నాగేందర్ పై వేటుతో ఖాయం: హరీశ్ రావు

రేపోమాపో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు..దానం నాగేందర్ పై వేటుతో ఖాయం: హరీశ్ రావు
  •     కాంగ్రెస్ పని అయిపోయింది.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని మాజీ మంత్రిహరీశ్ రావు అన్నారు. పార్టీ మారిన దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు డిస్కాలిఫై చేసిందని, రాష్ట్రంలో రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. ఏ పార్టీలు, ఏ ఏజెన్సీలు సర్వేలు చేసినా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని రిపోర్టులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్​ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు శనివారం హరీశ్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

రేవంత్‌‌‌‌‌‌‌‌పై 5 లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారన్నారు. మరో ఎమ్మెల్యే 20 శాతం లంచం ఇస్తేనే పని అవుతోందని అంటున్నారని తెలిపారు. సొంత ఎమ్మెల్యేలే తిరగబడుతుండడంతో సీఎం అసహనానికి లోనై కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీశారని విమర్శించారు. నగరంలో రోజుకు 80 వేల వాటర్ ట్యాంకర్లు కొనే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. .

పరిశ్రమలు, శాంతిభద్రతలు గాలికి..

రాష్ట్రంలో రెండేళ్లుగా పరిశ్రమల శాఖకు, ఐటీ శాఖకు ప్రత్యేక కార్యదర్శులు లేరని, చీఫ్ సెక్రటరీకే ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలు ఇచ్చారని హరీశ్ విమర్శించారు. గతేడాది ‘తెలంగాణ రైజింగ్’ పేరిట సదస్సు పెట్టారని, దాని ద్వారా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బస్తీ దవాఖానాల్లో కనీసం బీపీ, షుగర్ గోలీలు లేవని, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు బంద్ అయ్యాయని ఆరోపించారు. టిమ్స్ ఎల్బీనగర్, సనత్‌‌‌‌‌‌‌‌నగర్, అల్వాల్ ఆస్పత్రుల నిర్మాణాలు మూడేళ్లుగా ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ ప్రభుత్వ విద్యావ్యవస్థను బాగు చేయడంలో విఫలమయ్యారని 
విమర్శించారు.