మలక్ పేట, వెలుగు: ద్విచక్ర వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చి ప్రయాణిస్తున్న ఓ మహిళపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ ఎస్సై సత్యనారాయణ మంగళవారం ఉదయం శంకేశ్వర్ బజార్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నకిలీ నంబర్‌ప్లేట్‌ను గుర్తించారు.
చాంద్రయణగుట్టకు చెందిన మహజబీన్ ఉన్నీసా 2018లో హోండా ఆక్టివా కొనుగోలు చేసి, తన పేరిట మార్చుకోకుండా ఫైనాన్స్ తప్పించుకునేందుకు మరో నంబర్‌తో వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
