ఆ టీచర్ మాకొద్దు..జమ్మికుంటలో స్టూడెంట్ల ఆందోళన

ఆ టీచర్ మాకొద్దు..జమ్మికుంటలో స్టూడెంట్ల ఆందోళన

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్  జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పని చేస్తున్న రామ్ రాజయ్య అనే టీచర్​ తమను కొట్టడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూల్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ టీచర్​ రామ్ రాజయ్య తమకు సరిగా చదువు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా సెల్ ఫోన్ లో అసభ్యకర ఫొటోలను చూపెడుతున్నాడని వాపోయారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్​కు చేరుకొని వివరాలు సేకరించారు.