హసన్ పర్తి, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2026–-27 విద్యా సంవత్సరానికి దూరవిద్య (ఓడిఎల్ ), ఆన్లైన్కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు మంగళవారం డైరెక్టర్ బి.సురేశ్లాల్ తెలిపారు. యూజీసీ-డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15తో ముగియాల్సిన ప్రవేశాల గడువును వచ్చే నెల 13 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
కేయూ దూరవిద్య ద్వారా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను కేయూ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.
