నల్లబెల్లి, వెలుగు: వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఓ మహిళా రైతు తన పంట పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటపూరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు లక్ష్మి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటల పెట్టుబడుల కోసం ప్రైవేట్ అప్పులు చేసి నష్టపోయామని తెలిపారు. ప్రభుత్వం రైతుల పరిస్థితిని గుర్తించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఫ్లెక్సీ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ ఫ్లెక్సీ స్థానికంగా చర్చనీయాంశమైంది.
