ఎంగేజింగ్‌‌ కంటెంట్‌‌తో  మిస్సింగ్ మేఘన 

ఎంగేజింగ్‌‌ కంటెంట్‌‌తో  మిస్సింగ్ మేఘన 

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య లీడ్ రోల్స్‌‌లో వాచస్పతి రూపొందించిన  చిత్రం ‘మిస్సింగ్ మేఘన’.  పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. సెప్టెంబర్  18న సినిమా విడుదల  కానుంది.

మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  అతిథులుగా  హాజరైన నిర్మాతలు దామోదర ప్రసాద్, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ..  ఎంగేజింగ్‌‌ కంటెంట్ ఉన్న  ఇలాంటి చిన్న చిత్రాలు  మంచి విజయం సాధించాలని కోరారు.  దర్శకుడు వాచస్పతి, హీరోలు రామ్ కార్తీక్, అంకిత్ కొయ్య, నటుడు గోపరాజు రమణ, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తమ  సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు.  ప్రేక్షకులు తమ చిత్రాన్ని  థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.