రాగ్ మయూర్ హీరోగా ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అనుమాన పక్షి’. మెరీన్ హీరోయిన్‌గా నటించగా, రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలకపాత్రలు పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించే సన్నీ పాత్రలో రాగ్ మయూర్ కనిపించాడు. కశ్మీర్‌లో ఓ అమ్మాయితో ప్రేమలో పడిన అతడిని ఓ పోలీస్ అధికారి ఎందుకు వెంటాడుతున్నాడనేది కథలో ఆసక్తికర అంశంగా ట్రైలర్‌లో చూపించారు. రాగ్ మయూర్ కామిక్ టైమింగ్, మెరిన్ ఫిలిప్‌తో కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది.
