తెలుగు సినీ చరిత్రలోనే పొడవైన టైటిల్ తో సినిమా

తెలుగు సినీ చరిత్రలోనే పొడవైన టైటిల్ తో సినిమా

 దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన తాజా చిత్రం  ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’.   తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌‌తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదలైంది.

సంగీతం, ధ్వని, మానవ మెదడు, జ్ఞాపకాలు, గిల్ట్ వంటి అంశాలతో  మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్‌‌లోని ఆసక్తికరమైన సంభాషణలు, విభిన్నమైన పాత్రలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.  హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరో హీరోయిన్స్‌‌గా  పరిచయమవుతున్న ఈ చిత్రంలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రల్లో నటించారు. మదన్  కథను  అందించగా, నిర్మాత, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను చంద్ర సిద్ధార్థ్ నిర్వహించారు.