- ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్లోప్రోగ్రాం ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఈనెల17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన ఉత్సవాలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. సచివాలయంలో వైస్ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారు లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈనెల 17న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకొని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని అన్నారు.
