వినాయకచవితి అవ్వగానే తగ్గిన బంగారం ధరలు మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. అంతర్జాతీయంగా చమురు మంటలు ఆర్థిక వ్యవస్థలకు సెగ పెడుతున్న వేళ వడ్డీ రేట్లు కూడా పెరిగిపోవటం బులియన్ మార్కెట్లను కుదిపేస్తోంది. చాలా మంది పెట్టుబడిదారులు బంగారం, వెండిపై బెట్ వేయటం కంటే డెట్ మార్కెట్లోని బాండ్స్ వైపు చూస్తున్నారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక రోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ ఒక స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రిటైల్ షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లోని అమ్మకపు రేట్లను పరిశీలించటం బెటర్.
సెప్టెంబర్ 16న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.27 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 344గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 065గా కొనసాగుతోంది.
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 16, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.
