పంత్‌‌కు చాన్స్‌‌ దక్కేనా?.. వెస్టిండీస్‌‌తో సిరీస్‌‌లకు ఇవాళ జట్ల ఎంపిక

పంత్‌‌కు చాన్స్‌‌ దక్కేనా?.. వెస్టిండీస్‌‌తో సిరీస్‌‌లకు ఇవాళ జట్ల ఎంపిక

 

న్యూఢిల్లీ: స్వదేశంలో వెస్టిండీస్‌‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌‌ల కోసం బుధవారం టీమిండియాను ఎంపిక చేయనున్నారు. వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా రీ ఎంట్రీపై ఇందులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఐపీఎల్‌‌లో ఫెయిలైన పంత్‌‌ టెస్ట్‌‌ వైస్‌‌ కెప్టెన్సీతో పాటు వైట్‌‌బాల్‌‌ జట్లలో ప్లేస్‌‌ను కోల్పోయాడు. అయితే ఇషాన్‌‌ కిషన్‌‌ జపాన్‌‌ పర్యటనకు వెళ్తుండటం, కేఎల్‌‌ రాహుల్‌‌ ప్రధాన వికెట్‌‌ కీపర్‌‌గా సేవలందించనున్నాడు. ఈ టైమ్‌‌లో పంత్‌‌కు టీమ్‌‌లో చోటు దక్కుతుందా? లేదా? చూడాలి. ఒకవేళ ఈ సిరీస్‌‌లో పంత్‌‌కు చాన్స్‌‌ దక్కకపోతే ధ్రువ్‌‌ జురెల్‌‌కు అవకాశం ఇవ్వనున్నారు. అప్పుడు పంత్‌‌ను ఇరానీ కప్‌‌ కోసం రెస్టాఫ్‌‌ ఇండియా జట్టుకు సారథిగా పంపించనున్నారు.

ఇప్పటికే ఆస్ట్రేలియా–ఎతో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ కోసం పాండ్యాను ఇండియా–ఎ జట్టులోకి తీసుకున్నారు. అయితే ఇందులో అతని ఫిట్‌‌నెస్‌‌ను అంచనా వేయనున్నారు. 10 ఓవర్ల బౌలింగ్‌‌, 50 ఓవర్ల ఫీల్డింగ్‌‌ చేయగలడా? లేదా? అన్నది పరిశీలించనున్నారు. ఒకవేళ పాండ్యా అందుబాటులో లేకపోతో సీమ్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్ల కొరత జట్టును వేధిస్తోంది. నితీశ్‌‌ కుమార్‌‌.. ఆసియా కప్‌‌ కోసం జపాన్‌‌ వెళ్తుండగా, సూర్యాన్ష్‌‌ షెడ్జే, వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ గాయాల నుంచి కోలుకుంటున్నారు. హైదరాబాద్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ ఈ సిరీస్‌‌ల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గుర్నూర్‌‌ బ్రార్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ, ప్రిన్స్‌‌ యాదవ్‌‌తో కలిసి పేస్‌‌ బౌలింగ్‌‌ను నడిపించనున్నాడు. ఆసియా కప్‌‌కు వెళ్తున్న బుమ్రా ఈ సిరీస్‌‌లకు అందుబాటులో ఉండడు. మహ్మద్‌‌ షమీ, చహల్‌‌ పేర్లను పరిశీలించే చాన్స్‌‌ లేదు. రవీంద్ర జడేజా, రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌, రజత్‌‌ పటీదార్‌‌కు చాన్స్‌‌ ఇవ్వొచ్చు. అక్టోబర్‌‌ 6 నుంచి జరిగే ఈ టూర్‌‌లో ఇండియా.. విండీస్‌‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.