బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. షేక్ హసీనా అనుచరులకు మరణశిక్ష

బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. షేక్ హసీనా అనుచరులకు మరణశిక్ష

ఢాకా: బంగ్లాదేశ్‌‌ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2024 నాటి విద్యార్థి ఉద్యమం అణచివేత కేసులో భాగంగా జస్టిస్ నజ్రుల్ ఇస్లామ్ చౌదరి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ మంగళవారం ఈ తీర్పును వెల్లడించింది.

 మరణశిక్ష పడిన వారిలో అవామీ లీగ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్, మాజీ మంత్రి మొహమ్మద్ అలీ అరాఫత్, ఏఎఫ్‌‌ఎం బహావుద్దీన్ నసీమ్, షేక్ ఫజ్లే షామ్స్ పరాశ్, మైనుల్ హొస్సేన్ ఖాన్ నిఖిల్, సద్దామ్ హుస్సేన్, షేక్ వలీ ఆసిఫ్ ఇనాన్ ఉన్నారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు నష్టపరిహారంగా ఐదుగురు దోషుల ఆస్తుల్లో సగం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

హసీనా 15 ఏండ్ల పాలనకు ముగింపు పలికిన ఈ ఉద్యమ సమయంలో హత్యలు, ప్రజావ్యతిరేక నేరాలకు పాల్పడినట్టు వీరిపై అభియోగాలు రుజువయ్యాయి. హసీనా ప్రభుత్వ అణచివేత చర్యల వల్ల 2024 జులై, ఆగస్టు మధ్య కాలంలో సుమారు 1,400 మంది మరణించినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.