కోబ్రా యూనిట్కు తొలి మహిళా చీఫ్‌‌..రికార్డులకెక్కిన సంజుక్త పరాశర్

కోబ్రా యూనిట్కు తొలి మహిళా చీఫ్‌‌..రికార్డులకెక్కిన సంజుక్త పరాశర్

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్  పోలీస్ ఫోర్స్ (సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌)కు చెందిన కోబ్రా ఐజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సంజుక్త పరాశర్ నియమితులయ్యారు. ఈమేరకు సీఆర్‌‌పీఎఫ్​ ప్రధాన కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళా ఆఫీసర్‌‌‌‌గా సంజుక్త చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దనేశ్ రాణా స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. పది బెటాలియన్ల కోబ్రా యూనిట్‌‌కు ఒక మహిళా ఆఫీసర్ నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి అని సీఆర్‌‌‌‌పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సంజుక్త పరాశర్ అస్సాం–మేఘాలయ కేడర్‌‌‌‌కు చెందిన 2006 బ్యాచ్ అధికారి.