డేవిస్ కప్‌కు యూకీ బాంభ్రీ దూరం.. తొడ కండరాల గాయంతో మ్యాచ్‌లకు నో

డేవిస్ కప్‌కు యూకీ బాంభ్రీ దూరం.. తొడ కండరాల గాయంతో మ్యాచ్‌లకు నో

సియోల్‌‌: ఇండియా డబుల్స్‌‌ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ యూకీ బాంభ్రీ.. సౌత్‌‌ కొరియాతో జరగనున్న డేవిస్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతను పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో లేడని కెప్టెన్‌‌ రోహిత్‌‌ రాజ్‌‌పాల్‌‌ స్పష్టం చేశాడు. ‘యూఎస్‌‌ ఓపెన్‌‌ నుంచి యూకీని ఈ గాయం వేధిస్తోంది. కోలుకోవడానికి మరింత టైమ్‌‌ పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే అతను మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌తో లేడు.

కాబట్టి డేవిస్‌‌ మ్యాచ్‌‌లకు యూకీ అందుబాటులో ఉండటం లేదు’ అని రాజ్‌‌పాల్‌‌ పేర్కొన్నాడు. గతంలో దక్షిణేశ్వర్‌‌ సురేశ్‌‌తో కలిసి బరిలోకి దిగిన యూకీ.. నెదర్లాండ్స్‌‌పై అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు యూకీ లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్లేయర్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎన్‌‌. శ్రీరామ్‌‌ బాలాజీని డబుల్స్‌‌లో బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డేవిస్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌ల కోసం అనిరుధ్‌‌ చంద్రశేఖర్‌‌ సియోల్‌‌ చేరుకోగా, నికీ పునాచా వీసా కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మ్యాచ్‌‌లో గెలిచిన జట్టు డైరెక్ట్‌‌గా ఫైనల్స్‌‌కు అర్హత సాధించనుంది.