హైదరాబాద్‌ లో ఫేస్‌జిమ్.. జిమ్‌లా ముఖానికీ వర్కౌట్, 40 నిమిషాల్లో గ్లో!

హైదరాబాద్‌ లో  ఫేస్‌జిమ్.. జిమ్‌లా ముఖానికీ వర్కౌట్, 40 నిమిషాల్లో గ్లో!

మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు జిమ్‌కు వెళ్తాం. నడక, వ్యాయామం, స్ట్రెచింగ్ అంటూ శరీర ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. కానీ ముఖం విషయంలో మాత్రం అంతగా దృష్టి పెట్టం. ముఖానికి వ్యాయామం కూడా ఇప్పుడు ట్రెండ్ గా మారుతోంది. వ్యాయామం స్ఫూర్తితో రూపొందించిన ఫేషియల్ వెల్‌నెస్ కాన్సెప్ట్ ‘ఫేస్‌జిమ్’ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది.

జీవీకే వన్ మాల్‌లోని టిరా బ్యూటీలో ఫేస్‌జిమ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ఫేషియల్‌కు భిన్నంగా ముఖ కండరాలపై ప్రత్యేక వ్యాయామాలు, మసాజ్ వంటి పద్ధతులతో ముఖాన్ని టోన్ చేయడం, ఉబ్బును తగ్గించడం, చర్మానికి ఫ్రెష్ లుక్ తీసుకురావడానికి ఈ స్పెషల్ ఫేస్ జిమ్ చేస్తారు. 

ఎక్కువ స్క్రీన్ టైమ్, పని ఒత్తిడి కారణంగా దవడ, నుదురు ప్రాంతాల్లో కండరాల ఒత్తిడి కనిపిస్తుంటుంది. ఫేస్‌జిమ్ వ్యాయామాలు రక్తప్రసరణకు సహాయపడటంతో పాటు ముఖ కండరాల ఒత్తిడిని తగ్గించి చర్మం తాజాగా కనిపించేందుకు సహకరిస్తుందని టికా బ్యూటీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ ఫేస్ జిమ్ వర్కవుట్ లలో ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన సెషన్ ఉండదు. చర్మ పరిస్థితి, వ్యక్తిగత అవసరాలు, కోరుకునే ఫలితాన్ని బట్టి నిపుణులు తగిన విధానాన్ని సూచిస్తారు. సెషన్‌కు ముందు అవసరమైన జాగ్రత్తలు, చేయకూడని పనులపై కూడా సూచనలు ఇస్తారు.

సుమారు 40 నిమిషాల్లో ఫేషియల్ వెల్‌నెస్ సెషన్ పూర్తయ్యేలా రూపొందించిన ఈ కాన్సెప్ట్.. బిజీ లైఫ్‌స్టైల్‌లో తక్కువ సమయంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ కు మరో మార్గంగా మంచి ఫలితాలను అందిస్తుంది.