మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’ ఫస్ట్ లుక్ విడుదల.. నవంబర్ 14న థియేటర్లలోకి

మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’ ఫస్ట్ లుక్ విడుదల.. నవంబర్ 14న థియేటర్లలోకి

ఆంటోని వర్గీస్, జమునా అబ్దు రెహ్మాన్, సైజు కురూప్, లుక్మన్ అవరణ్ లీడ్ రోల్స్‌‌లో  నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న చిత్రం  ‘మెస్సి –  లవ్ ఫ్రమ్ ఇండియా’.  ఆకర్ష ఆలపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌, టైటిల్ గ్లింప్స్‌‌ను  స్కూల్ పిల్లల చేతుల మీదుగా లాంచ్ చేశారు.

బాలల దినోత్సవం సందర్భంగా  నవంబర్ 14న  సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ ‘చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.  తెలుగు ప్రేక్షకులకు ‘మెస్సి’ చిత్రాన్ని అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.