ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా శంకర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీరస్తు’. పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే కామెడీతో తెరకెక్కిస్తున్నామని, త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలియజేశారు. సుమన్, దేవి ప్రసాద్, ఆమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.
