డోక్రా అంటే బెల్ మెటల్ కళ. డోక్రా అనేది నాన్ ఫెర్రస్ మెటల్ కాస్టింగ్‌తో లాస్ట్ వాక్స్ కాస్టింగ్ టెక్నిక్‌లతో కూడిన హస్తకళ. డోక్రా అనేది ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలోని ఉషేగావ్ గ్రామంలో తయారు చేస్తున్న పురాతన గిరిజన లోహపు హస్తకళ. మైనపు పద్ధతిని ఉపయోగించి డోక్రా కళాఖండాలు ఇత్తడితో తయారు చేస్తారు. పూర్తయిన కళాఖండానికి ఎలాంటి అతుకులు ఉండవు. ఈ కళలో బొమ్మల తయారీకి ఎర్రమట్టి, మైనం, ఇత్తడి పదార్థాలను ఉపయోగిస్తారు.
డోక్రో మెటల్ కళ భారతదేశంలో 4000 సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతున్నది. విభజనకు పూర్వం భారతదేశంలో డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో ఈ కళకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ఈ హస్తకళ కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కెరిమెరి మండలం, కేశలగూడు, జిమ్గావ్, ఉషేగావ్, చిత్తల్బరి గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తున్నది. ఈ కళలో జానపద డిజైన్లు, డోక్రా గుర్రాలు, ఏనుగులు, నెమ్మళ్లు, దీపారాధనలు కొలిచే గిన్నెలు, దేవుడి బొమ్మలు, దీపపు స్తంభాలను ఎలాంటి అతుకులు లేకుండా తయారు చేస్తారు.
