క్యాబ్, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో (Rapido) పై సెంట్రల్ కన్జూమర్ ఫోరం రూ. 10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులపై ఎక్కువ డబ్బు చెల్లించేలా ఒత్తిడి తీసుకొచ్చే డిజిటల్ పద్ధతులు ఉపయోగించిందని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు చేపట్టింది. రైడ్ బుక్ చేసిన తర్వాత యాప్‌లో రకరకాల మేసేజ్ లను పంపడం ద్వారా కస్టమర్లపై మానసిక వత్తిడికి పెంచేలా మేసేజ్ లు పంపుతున్నట్లు వాచ్ డాగ్ గుర్తించింది. అంటే ఎక్కువ డబ్బు ఇస్తేనే త్వరగా రైడ్ దొరుకుతుందనే భావన కలిగించేలా యాప్ రూపకల్పన చేసినట్లు CCPA గుర్తించింది.
CCPA ఇచ్చిన కీలక ఆదేశాలు..
ర్యాపిడోపై రూ.10 లక్షల జరిమానా విధించిన సెంట్రల్ కన్జూమర్ ఫోరం.. ముందస్తు టిప్పింగ్ (Advance Tipping) ప్రోత్సహించే ఫీచర్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. కస్టమర్లకు ఎక్కువ చెల్లింపుల వైపు నెట్టే ఇంటర్‌ఫేస్ నిలిపివేయాలని కోరింది. 15 రోజుల్లో రూల్స్ అమలు చేసినట్లు కంప్లయన్స్ రిపోర్టు సమర్పించాలని తెలిపింది.
అడ్వాన్స్ టిప్పింగ్ పై అభ్యంతరం..
సాధారణంగా టిప్ అనేది సర్వీ్స్ పూర్తయ్యాక స్వచ్ఛందంగా ఇవ్వాల్సినది. కానీ ర్యాపిడో బుకింగ్ దశలోనే అదనపు మొత్తం చెల్లిస్తే రైడ్ వచ్చే అవకాశం పెరుగుతుందని సూచించడం కస్టమర్లను తప్పుదోవ పట్టించే అడ్వటైజ్ గా గుర్తించారు.
ఇతర సంస్థలపైనా విచారణ..
క్యాబ్ అగ్రిగేటర్లలో అడ్వాన్స్ టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై CCPA దృష్టి సారించింది. ఓలా, ఉబర్ వంటి ఇతర ప్లాట్‌ఫాంలపై కూడా విచారణ కొనసాగుతోంది.
