తల్లి, అక్క, బావ కలిసి చంపేసి వరి పొలంలో పాతిపెట్టారు.. కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన

తల్లి, అక్క, బావ కలిసి చంపేసి వరి పొలంలో పాతిపెట్టారు.. కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన

తనుగుల: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో దారుణం వెలుగుచూసింది. వారం రోజుల క్రితం నమోదయిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. రాజబాబు అనే వ్యక్తిని.. తల్లి,అక్క, బావతో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి ఉరి వేసి హత్య చేసి పాతి పెట్టారని పోలీసులు వెల్లడించారు.

నిందితులను తీసుకువచ్చి మృత దేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్టుమార్టానికి పంపారు. నిత్యం తాగి వచ్చి తల్లి, అక్క బావతో గొడవ పడడమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్కు తరలించనున్నారు. పెద్ద సంఖ్యలో జనం మద్యానికి బానిసలవుతున్నారు. తాగిన మైకంలో కొందరు చిన్నచిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటుండగా, ఇంకొందరు విచక్షణ కోల్పోయి హత్యల దాకా వెళ్తున్నారు. లేదా.. అయిన వాళ్ల చేతుల్లోనే హత్యలకు గురవుతున్నారు. 80 శాతం నేరాలకు మద్యమే కారణమని పోలీసులు చెప్తున్నారు.