కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యా రవీందర్ రావుకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో ఘన స్వాగతం లభించింది. ఓల్డ్ స్టూడెంట్లు గుడి విష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జ్ లీడర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో రవీందర్ రెడ్డిని ఆహ్వానించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులంతా కలిసిమెలిసి ఉండి అమెరికా అభివృద్ధితో పాటు పుట్టినిల్లు అయిన భారతదేశ అభివృద్ధికి సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
