వెస్టిండీస్‌తో భారత్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ XI ఇదే: మరీ ఆకిబ్ నబీకి గిల్ ఛాన్స్ దక్కేనా?

వెస్టిండీస్‌తో భారత్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ XI ఇదే: మరీ ఆకిబ్ నబీకి గిల్ ఛాన్స్ దక్కేనా?

Team India Strongest ODI XI: 2027 వన్డే ప్రపంచకప్ వేటలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ బలమైన భారత స్క్వాడ్‌ను ప్రకటించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియాలో సీనియర్లు రీఎంట్రీ ఇవ్వగా, ఆసియా గేమ్స్ కారణంగా కొందరు స్టార్లకు స్థానం చోటు మాత్రం దక్కలేదు. 

హిట్‌మ్యాన్-కింగ్ ఈజ్ బ్యాక్: 

* రోహిత్ కమ్‌బ్యాక్: లార్డ్స్ వన్డేలో అద్భుతమైన సెంచరీతో వన్డేల్లో తన సత్తా ఏంటో నిరూపించిన రోహిత్, యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టి గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

* విరాట్ కోహ్లీ రాంపేజ్: వన్డే ఫార్మాట్ కింగ్ విరాట్ కోహ్లీ నంబర్-3లో దిగి విండీస్ బౌలర్లపై దండయాత్రకు రెడీ అయ్యాడు. గిల్, రోహిత్, కోహ్లీల టాప్ ఆర్డర్ భారత్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది.

శ్రేయస్ ఔట్.. రుతురాజ్ ఇన్: 

* ఆసియా గేమ్స్ ఎఫెక్ట్: ఆసియా గేమ్స్ 2026 టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో, అతడు ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా ఆసియా గేమ్స్ బరిలోనే ఉన్నాడు.

* రుతురాజ్ గోల్డెన్ ఛాన్స్: శ్రేయస్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్‌లో నంబర్-4 స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు బంఫర్ ఆఫర్ దక్కింది.

* కీపర్‌గా కేఎల్ రాహుల్: మిడిల్ ఆర్డర్ లో జట్టుకు వెన్నుముక నిలిచిన కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా రాబోతుండగా, ధ్రువ్ జురెల్ బ్యాకప్‌గా ఎంపికయ్యాడు.

►ALSO READ | రోహిత్, కోహ్లీ వల్లే అగార్కర్ ఔట్: భారత చీఫ్ సెలెక్టర్‌గా హైదరాబాద్ మాజీ క్రికెటర్?

హార్దిక్ లేకపోవడంతో నితీష్‌కే ప్రాధాన్యత: 

* నితీష్ రెడ్డి హవా: ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమవ్వడంతో ఆంధ్రా కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వన్డేల్లోనూ తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.

* జడేజాకు లాస్ట్ ఛాన్స్: గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో  రాణించలేకపోతున్న సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన ఫామ్ నిరూపించుకోవడానికి దక్కిన గోల్డెన్ ఛాన్స్.

బుమ్రా లేకున్నా బౌలింగ్ పవర్ ఫుల్: 

* ఆకిబ్ నబీ, నమన్ ధీర్ సర్ ప్రైజ్: లిస్ట్-ఏ క్రికెట్‌లో 56 వికెట్లతో పాటు 111 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయగల జమ్మూ కాశ్మీర్ స్టార్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీతో పాటు నమన్ ధీర్‌లు తొలిసారి భారత వన్డే జట్టుకు ఎంపికయ్యారు. 

* సిరాజ్ లీడర్‌షిప్: బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనుండగా, ప్రసిద్ధ్ కృష్ణ రెండో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఫిక్స్.
 
భారత్ జట్టు అంచనా: 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.